ఆజ్ కి బాత్..

అప్పు లేని బ్రతుకు అద్భుతమైన బ్రతుకు.. కారం మెతుకులు తిన్నా కంటి నిండా కునుకు… అప్పు చేసి ఆగం కావద్దన్నో…

ఆజ్ కి బాత్..

అప్పు లేని బ్రతుకు అద్భుతమైన బ్రతుకు..
కారం మెతుకులు తిన్నా కంటి నిండా కునుకు…
అప్పు చేసి ఆగం కావద్దన్నో…
అప్పు ఉన్న మనస్సు అరవై ఊర్లు తిరుగు..
అప్పుల కుప్ప పాముల పుట్టలా పెరుగు..
అవసరానికి మించిన అప్పు ఆయువు కూడా తియ్యును..
అధిక అప్పు ఆరోగ్యానికి హానికరం..
అందుకే అప్పు చేసే ముందు ఆలోచన
చెయ్యాలె…!! ఇంత వరకు బాగానే ఉంది..
మరి ఏమాలోచించి అయ్యగారు అప్పుచేశారు..?
ఆయన సుఖంగానే ఉన్నారు..
మన బ్రతుకులే ప్రమాదంలో పడ్డాయి..

- ముచ్కుర్ సుమన్ గౌడ్