ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..
- నిరు పేద తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారినా ప్రైవేట్, కార్పొరేట్ పిజుల దోపిడి అరికట్టాలి.
- పేద విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. ఉపాధ్యాయ, అధ్యాపక వేతనాలు ఖరారు చేయాలి.?
- ప్రభుత్వ పాఠశాలల నుండి యూనివర్సిటీల వరకు నియామకాలు, ఏకకాలంలో
50వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేయాలి. - డిమాండ్ చేసిన కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు.
- ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని పత్రికా ప్రకటన విడుదల.
హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నాడు రాష్ట్ర సాధన కోసం, నేడు చదివిన సర్టిఫికెట్ల కోసం తనువులు తగలబడుతున్నాయి.. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో విద్య ప్రైవేట్ పరమై, కార్పొరేట్ కబంధహస్తాలలో విలవిలలాడుతున్న సందర్భంగా కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ నినాదమైన సామాన్యుడు, సంపన్నులు ఒకే చోట చదివే విద్యా విధానం.. రాజ్యాంగ లక్ష్యం నెరవేరుటలేదు.. విద్యా, రాజకీయ, ఆర్థిక అసమానతలు పెరిగిపోయి సాంఘిక దురాచారాలు ఉగ్రవాదం, మతోన్మాదం పెరిగి మానవ విలువలు నశించి జీవన ప్రమాణాలు స్వార్థం అవినీతితో కూరుకుపోయాయి.. ఇన్ని అనర్ధాలకు మూలం నాణ్యమైన సమాన విద్య అందకపోవడమే. ఇలాంటి అమూల్యమైన ప్రాథమిక హక్కు అయిన విద్యను పేదలకు దూరం చేస్తూ.. సమాజంలో నూతన అసమానతలు సృష్టిస్తున్న విద్యా క్యాపిటలిస్టుల కుట్రలను బహిర్గతం చేస్తూ.. పాఠశాలల ఇంటర్ కళాశాలల పీజుల నియంత్రణ ఉపాధ్యాయ అధ్యాపక వేతనాలు ఖరారు కమిటీ చేయాలని.. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ సమాన విద్య అందించాలని కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. డి.ఎఫ్.ఆర్.సి. డిస్టిక్ పీస్ రెగ్యులేషన్ కమిటీ ద్వారా పాఠశాల యజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు జిల్లా కలెక్టర్ తో కూడిన చట్టబద్ధమైన కమిటీ ద్వారా సెప్టెంబర్ లోపు నిర్ణయించి ఉల్లంఘనకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత సర్కారుదే.. ఈ కమిటీ నిర్ణయించిన ఫీజులు మూడు సంవత్సరాలు అందుబాటులో చెల్లుబాటు అవుతాయి.. కానీ ప్రభుత్వం 2017లో ఆచార్య తిరుపతిరావు కమిటీ వేసి ఇచ్చిన నివేదిక అమలు కాకుండా పలు వివాదాలతో నిలిచిపోయింది. 2022లో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా మంత్రివర్గం ఉప సంఘం ఫీజుల నియంత్రణకై చట్ట రూపకల్పనకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా.. నీటి మూటలు గానే ఫీజుల నియంత్రణ మిగిలింది. ప్రభుత్వాలు పరోక్షంగా విద్యా క్యాప్ట లిస్టు లకు విద్యను దోపిడి హక్కుగా మార్చారు.. విద్య కోసం అనేక శాసనాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ కార్పొరేట్ బడులు బందిఖనాలుగా విద్య మారిపోయింది.. భారత రాజ్యాంగం విద్యా నాణ్యత సమాన స్థాయిలో ప్రతి ఒక్కరికి శాసనం రక్షణ కల్పిస్తుంది. నేడు విద్యా వ్యాపారుల లాభాపేక్షకు పేదలు ఆర్థికంగా బలైపోతూ విద్యకు దూరమవుతున్నారు. విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల జీతాలు. ఫీజులు ఎంత చెల్లించాలో నిర్ణయించడం శాసనాలు స్పష్టం చేస్తున్నాయి అయినా అనేక చట్టాలు నియమాలు అమలు కావడం లేదు. ప్రజాకర్షణ ఉచిత పథకాలతో సంతోష పడుతూ.. పాలకులకు బానిసలుగా తయారై ఓటును తాకట్టు పెట్టి ఉచితంగా పొందే విద్యను ఖరీదు కొంటున్నారు అంటే.. ప్రజలు ప్రాథమిక హక్కులను పొందే బాధ్యతలు మర్చిపోతున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా విద్య అసమాత వివక్ష దోపిడికి గురికాకుండా సామాన్యుడు సంపన్నుడు ఒకే చోట చదివే నాణ్యమైన విద్య అమలు చేయకపోవడం వల్ల నేడు దేశంలో కోట్లాదిమంది కోటికి లేని నిరుపేదలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య పొందలేక, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు చదువుకోనలేక, లక్షల మంది విద్యకు దూరమవుతూ దారిద్రానికి దిగువన ఆకలి బాధతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అధికారికంగా గుర్తించబడ్డ పేదలు తమ పిల్లలు నియంత్రణ లేని ఫీజులతో దోపిడికి గురవుతుంటే నియంత్రణ కమిటీ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఏమనాలి..? తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం పైగా ఉచిత బియ్యం నిరుపేద తల్లి దండ్రులు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఆస్తులు, నగలు, సంపద అమ్మి అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు.. మంచి స్కూల్లో జాయిన్ చేసి ఉన్నత చదువులు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే తల్లి దండ్రుల బలహీనతలను కార్పోరేట్ స్కూల్ రాజ్యాంగ ఫీజులు అడ్డు అదుపు లేకుండా పెంచి.. ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. యూనిఫామ్, షూస్, మెటీరియల్ మోత, బరువు పుస్తకాలతో శారీరక, మానసిక ఒత్తిడిని కలిగిస్తూ.. స్వేచ్ఛను కాలరాస్తూ.. బందిఖానాలుగా విద్యాసంస్థలను మార్చేశారు. మోసపూరిత ప్రకటనలతో మార్కులు, ర్యాంకుల మోజులో అప్పులు చేసి, ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు వేధింపులకు గురై మానసిక ఒత్తిడితో, అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతూ.. తల్లి దండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. యాజమాన్యాలు వేలకోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేస్తూ.. రాజకీయ కార్పొరేట్ ప్రజా ప్రతినిధిగా చలామణి అవుతూ.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి విద్యా వ్యాపారుల దోపిడీపై మంత్రి మల్లారెడ్డి తరహా ఐటి, ఈడి దాడులు నిర్వహించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.