మరాఠా యోధుడికి వార్నింగ్ లు..
చంపుతామంటూ మెసేజ్ లు.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్.సి.పీ. నాయకులు.. మహారాష్ట్ర హోం మంత్రి తక్షణమే స్పందించాలి : సుప్రియా సూలే.. ముంబై, మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్...
- చంపుతామంటూ మెసేజ్ లు..
- ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్.సి.పీ. నాయకులు..
- మహారాష్ట్ర హోం మంత్రి తక్షణమే స్పందించాలి : సుప్రియా సూలే..
ముంబై, మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్‌లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు. ఆ విషయమై సుప్రియ, పలువురు ఎన్సీపీ నేతలు ముంబై పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అగంతకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రియా సూలే మీడియాతో మాట్లాడుతూ.. పవార్‌ను బెదరిస్తూ వాట్సాప్‌లో తనకు మెసేజ్ వచ్చిందని, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని చెప్పారు. ఈ విషయంలో మహారాష్ట్ర హోం మంత్రి, కేంద్ర హోం మంత్రి సత్వరం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలను వెంటనే ఆపాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, ఉద్ధవ్ థాకరే వర్గం ఎంపీ సంజయ్ రౌత్, ఆయన సోదరుడు సునీల్ రౌత్‌కు కూడా గురువారం బెదిరింపు ఫోన్లు వచ్చాయి. మీడియా ముందు మాట్లాడవద్దంటూ తమకు బెదరింపు కాల్స్ వచ్చినట్టు ఉద్ధవ్ థాక్రే వర్గం ఎమ్మెల్యే సునీల్ రౌత్ తెలిపారు. దీనిపై ముంబై పోలీస్ కమిషనర్, రాష్ట్ర హోం మంత్రికి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు..