టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.దీంతో భక్తులు..

టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.దీంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,160 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 38,076 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ శివ కుమార్ పాల్గొన్నారు